![]() |
![]() |

ఆట షో లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రీతీ పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. ఇక అప్పుడు జడ్జ్ నిహారిక ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పింది. "చందమామ సినిమా టైములో హీరోయిన్ కాజల్ మా నాన్నను నాన్న అంటూ పిలిచేది. ఉడికిపోయేదాన్ని. ఎవరు నువ్వు అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అన్నాను. నిజానికి మా నాన్నకు కాజల్, నేను . రీల్ డాటర్, రియల్ డాటర్ అని ఏదో చేసాం అప్పట్లో. అది కాదు నాన్న ఇది కాదు నాన్న అని కాజల్ అంటుంటే నాకు కోపం వచ్చేస్తూ ఉంది.
ఎవరిదీ బొంబాయి నుంచి వచ్చి మా నాన్నను నాన్న నాన్న అంటుంది అనుకున్నా . నాన్నొచ్చి నన్ను అమ్మను ఊహించుకుని ఆ సీన్ చేసాను అన్నారు. అందుకే అంత బాగా నేచురల్ గా వచ్చింది అన్నారు. నీకు కావాలంటే నన్ను పిలవాలి. నన్ను ఊహించుకుని వేరే వాళ్ళతో చేయడం కాదు అన్నాను. నాకు నాన్నంటే విపరీతమైన పొసెసివ్ నెస్ ఉంది. కాజల్ కి ఈ విషయం తెలిసి చాలా రోజులు నన్ను ఏడిపించింది. నాన్న ఎక్కడున్నారు నాన్న ఎం చేస్తున్నారు అంటూ ఆటపట్టించేది.
.webp)
నాన్న ఎం చెయ్యట్లేదు. మీ నాన్న కాదురా నా నాన్న" అని గట్టిగా చెప్పాను కాజల్ కి అంది. ఇక ప్రీతీ పెర్ఫార్మెన్స్ అయ్యాక రఘు మాష్టర్ తన కూతురికి కాల్ చేసి ఆ డాన్స్ , అదంతా చూపించారు. చివరికి నువ్వు నాతో డాన్స్ చేస్తావా అనేసరికి చేయను అని ఫోన్ కట్ చేసేసింది.
![]() |
![]() |